
సినిమాలు

సంగారెడ్డి జిల్లాలో భార్యను హతమార్చేందుకు భర్తే సుపారీ గ్యాంగ్‌ను నియమించిన దారుణ ఘటనను పోలీసులు ఛేదించారు. మే 30న ఐడీఏ బొల్లారం పరిధిలో జరిగిన ఈ ఘటనలో భార్య మీనా దేవిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని మొదట భర్త అనిల్‌కుమార్ ఫిర్యాదు చేశాడు.
అయితే దర్యాప్తులో అతడి వాదనలో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఘటన స్థలంలో కూరగాయల సంచి కీలక ఆధారంగా మారింది. అనిల్ గాయాలు కూడా అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు లోతుగా విచారణ చేయగా, బిహార్‌కు చెందిన నలుగురికి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తేలింది. భర్తతో పాటు ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా, మిగతా వారిని గాలిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!