
సినిమాలు

హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌తో పాటు గోల్కొండ సమీపంలోని హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో ఈ ఉత్సవాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ప్రారంభించారు. రంగురంగుల హాట్ ఎయిర్ బెలూన్లు ఆకాశంలో విహరిస్తూ నగరవాసులను, సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న ఔత్సాహికులు హాట్ ఎయిర్ బెలూన్లలో ఆకాశ విహారం చేసి అరుదైన అనుభూతిని పొందుతున్నారు. బెలూన్ల నుంచి నగరాన్ని వీక్షించడం ఎంతో మరిచిపోలేని అనుభూతిగా మారిందని పాల్గొన్నవారు చెబుతున్నారు. ఈ ఫెస్టివల్‌తో హైదరాబాద్‌లో పర్యాటక ఉత్సాహం మరింత పెరిగిందని నిర్వాహకులు తెలిపారు.












కామెంట్స్ (1)
Good option for the natives of the Hyderabad to participate and enjoy the rides ..