
సినిమాలు

తెలంగాణ హైకోర్టు పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై తీవ్రంగా స్పందిస్తూ డీజీపీ సీవీ ఆనంద్, మాజీ డీజీపీ శివధర్ రెడ్డిలకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. అలాగే ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్కు కూడా నోటీసులు పంపింది. జనవరి 20న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పెండింగ్ చలాన్లు ఉన్నాయనే కారణంతో వాహనాలను సీజ్ చేయకూడదని కోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఈ ఉత్తర్వులను పట్టించుకోవడం లేదని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేనెల 19కి వాయిదా వేసింది. ఈ పరిణామం ట్రాఫిక్ నియంత్రణలో న్యాయస్థాన ఆదేశాల అమలుపై చర్చకు దారితీసింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!