
ఆరోగ్యం

గుంటూరు జిల్లాలో భారీ వర్షం, ఈదురుగాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. ఉదయం వరకు తీవ్ర ఎండలు ఉండగా, సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుని కుండపోత వర్షం కురిసింది. బలమైన గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలగా, భారీ హోర్డింగులు కూడా కుప్పకూలినట్లు సమాచారం. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అమరావతి పరిసర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఈదురుగాలుల ధాటికి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, పలు ప్రాంతాల్లో గంటల పాటు కరెంట్ నిలిచిపోయింది. ఒక్కసారిగా మారిన వాతావరణ పరిస్థితులతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!