
సినిమాలు

హీట్ డోమ్ ప్రభావంతో యూరప్ దేశాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బ్రిటన్, ఐర్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ వంటి దేశాలు తీవ్రమైన వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. బ్రిటన్‌లో 34.8 డిగ్రీల వరకు, స్పెయిన్‌లో సుమారు 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
హీట్ డోమ్ అంటే ఒక ప్రాంతంలో అధిక పీడన వ్యవస్థ కారణంగా వేడి గాలులు అక్కడే చిక్కుకుపోవడం వల్ల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం అని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా యూరప్‌లో వేసవిలో 17–18 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. అనేక దేశాల్లో హెచ్చరికలు జారీ చేయడంతో పాటు మధ్యాహ్న వేళల్లో బయట పనులు చేయవద్దని సూచనలు ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!