
క్రీడలు

తిరుమలలో నేడు హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జాపాలి హనుమాన్ ఆలయంతో పాటు బేడి ఆంజనేయస్వామి ఆలయం, ఘాట్ రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టారు. టిటిడి తరఫున జాపాలి హనుమాన్ స్వామికి సారె సమర్పించనున్నారు. ఆలయ పరిసరాల్లో భక్తిశ్రద్ధలతో వేడుకలు కొనసాగుతున్నాయి.
హనుమాన్ జయంతి సందర్భంగా జాపాలి హనుమాన్ దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల వద్ద క్యూలైన్లు కనిపిస్తున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల రద్దీతో తిరుమల ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!