

హైదరాబాద్ మహానగరంలో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన మెట్రో రెండో దశ విస్తరణకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. మొదటి దశ ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత, రెండో దశ డీపీఆర్‌లకు త్వరలో కేంద్ర ఆమోదం లభించే అవకాశం ఉంది.
నగర ప్రజా రవాణాలో మెట్రో కీలకంగా మారింది. వేగవంతమైన ప్రయాణ సౌకర్యంతో మెట్రోకు భారీ ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎనిమిది కారిడార్లతో రెండో దశ విస్తరణను ప్రతిపాదించింది. ఎయిర్‌పోర్ట్, పాతబస్తీ, మేడ్చల్ వంటి ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు.
ఈ ప్రాజెక్టును కేంద్రం, రాష్ట్రం 50:50 భాగస్వామ్యంతో చేపట్టనున్నారు. మొదటి దశను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవడంతో రెండో దశకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని భావిస్తున్నారు. కేంద్రం అనుమతి రాగానే మొదట పాతబస్తీ, ఎయిర్‌పోర్ట్ కారిడార్ల పనులు ప్రారంభించే అవకాశం ఉంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!