

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన మహిళల క్రికెట్ టోర్నమెంట్‌కు విశేష స్పందన లభించింది. సెప్టెంబర్ 19న ఆల్బర్ట్ సి. మిల్లర్ పార్క్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో వివిధ జట్లు పాల్గొని క్రీడాస్ఫూర్తి, ప్రతిభను చాటాయి. మ్యాచ్‌లను నిష్పాక్షికంగా, సజావుగా నిర్వహించిన అంపైర్లు సురేశ్ యలమంచి, వెంకటేశ్ జాగర్లమూడి, శ్రీధర్ సాదినేని, చలం పావులూరి, ప్రసాద్ క్రొత్తపల్లి, వినీత్ తుమ్మల, స్వర్జీత్‌లను తానా మిడ్ అట్లాంటిక్ బృందం అభినందించింది. టోర్నమెంట్‌ను తొలి నుంచి సమన్వయం చేస్తూ, పూర్తి స్థాయిలో మద్దతు అందించిన మహిళా కోఆర్డినేటర్ దీప్తి కోక సేవలను నాయకులు ప్రత్యేకంగా ప్రశంసించారు. తానా బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి, సతీశ్ తుమ్మల టోర్నమెంట్‌లో పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు.
టోర్నమెంట్ విజయవంతం కావడానికి రోజంతా సేవలందించిన సురేశ్ యలమంచి, సునీల్ కోగంటి, చలం పావులూరి, రంజిత్ మామిడి, ప్రసాద్ క్రొత్తపల్లి, కృష్ణ నందమూరి, గోపి వాగ్వాల, శ్రీధర్ సాదినేని, కట్టా చైతన్య, క్రిషిత నందమూరిలను నిర్వాహకులు అభినందించారు. ఉదారంగా స్పాన్సర్‌షిప్ అందించిన రామకృష్ణ తాడిశెట్టికి కృతజ్ఞతలు తెలిపారు. తొలి తానా మిడ్ అట్లాంటిక్ మహిళల క్రికెట్ టోర్నమెంట్‌లో పవర్ బ్లేజెస్ ఛాంపియన్స్‌గా, టైటాన్స్ రన్నరప్‌గా నిలిచాయి. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఐశ్వర్య లచగరి, బెస్ట్ బ్యాటర్‌గా నిత్య కేశవ, బెస్ట్ బౌలర్‌గా ప్రియాంక రామిశెట, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అజంతా తాడూరి, బెస్ట్ వాలంటీర్ ఆఫ్ ది డేగా క్రిషిత నందమూరి ఎంపికయ్యారు. టోర్నమెంట్ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరినీ తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్ అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివ చావ అభినందించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!