
సినిమాలు

రాష్ట్ర ప్రభుత్వ పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రేపు తిరుపతిలో కూటమి బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని సంక్షేమం, అభివృద్ధి అంశాలపై ప్రజలకు వివరించే వేదికగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల్లో సభలు నిర్వహించనుండగా, తొలి సభ తిరుపతిలో జరుగుతుంది.
ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి నారా లోకేష్ తదితరులు ఈ సభకు హాజరుకానున్నారు.
దామినేడులో సుమారు 15 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. దాదాపు వెయ్యి మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. రెండేళ్ల పాలనలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను నేతలు ప్రజలకు వివరించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!