
జనరల్

జాతీయ క్రీడా పురస్కారాలు-2025 విజేతలకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్, షట్లర్ గాయత్రి గోపిచంద్ ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపిక కావడంపై అభినందనలు తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ధనుష్ శ్రీకాంత్, గాయత్రి గోపిచంద్ ప్రతిభ తెలంగాణతో పాటు దేశానికి గర్వకారణమని గవర్నర్ పేర్కొన్నారు. క్రీడాకారుల అంకితభావం, కఠోర శ్రమ, అసాధారణ విజయాలు యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తాయని అన్నారు. భవిష్యత్‌లో వారు మరిన్ని విజయాలు సాధించి, మరిన్ని ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకోవాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!