
జనరల్

సీఎం విజయ్ టీ 11.40 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా 100 శాతం పంట రుణ మాఫీ పథకాన్ని ప్రకటించినట్లు సమాచారం. ఈ పథకం ప్రకారం అర్హులైన రైతుల తరఫున ప్రభుత్వం నేరుగా బ్యాంకులకు పెండింగ్ రుణాలను చెల్లించనుంది. ఈ నిర్ణయం రైతుల్లో భారీ ఉత్సాహాన్ని కలిగించింది. ఆర్థిక ఒత్తిడిలో ఉన్న రైతులకు ఇది పెద్ద ఊరటనిచ్చే చర్యగా భావిస్తున్నారు.
ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. రైతుల రుణ భారం తగ్గించేందుకు తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు స్వాగతిస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది ఊతమిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ పథకం రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనుందని భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!