
జనరల్

హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడుల అనంతరం అమెరికా ఇరాన్‌పై మరోసారి దాడులు చేపట్టింది. ఇరాన్ సైనిక స్థావరాలు, నౌకాశ్రయ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. అంతర్జాతీయ జలమార్గంలో పౌర నౌకలపై దాడులకు ప్రతిగా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణి నిల్వలు, డ్రోన్ స్థావరాలు, తీర నిఘా వ్యవస్థలు లక్ష్యంగా దాడులు జరిగినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఖేష్మ్, బందర్ అబ్బాస్ ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఇదే సమయంలో అమెరికా ఇరాన్ చమురు లైసెన్సును రద్దు చేయగా, ఈ చర్యను ఇరాన్ తీవ్రంగా ఖండించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!