

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే విదేశీ భక్తులకు కేంద్ర ప్రభుత్వం కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుపతి విమానాశ్రయాన్ని ఈ-వీసా కలిగిన విదేశీయులు భారత్‌లో ప్రవేశించగలిగే విమానాశ్రయాల జాబితాలో చేర్చింది. దీంతో ఇప్పటివరకు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల ద్వారా ప్రయాణించాల్సిన విదేశీ భక్తులకు మరింత సౌలభ్యం కలగనుంది.
తిరుపతి విమానాశ్రయంలోనే విదేశీ ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని నేరుగా తిరుపతికి చేరుకునే అవకాశం ఏర్పడింది. తిరుపతి విమానాశ్రయానికి 2008లో అంతర్జాతీయ విమానాశ్రయ హోదా ప్రకటించగా, విదేశీ భక్తుల రాకపోకలకు నేరుగా అంతర్జాతీయ కనెక్టివిటీ కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులో లేకపోయినప్పటికీ, భవిష్యత్తులో అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలకు ఈ నిర్ణయం ఊతమివ్వనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!