
జనరల్

చైనా పర్యటన ముగించుకుని వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌పై మరోసారి కఠిన నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. హోర్ముజ్ జలసంధి విషయంలో కొనసాగుతున్న దౌత్య ప్రతిష్టంభన నేపథ్యంలో అమెరికా మరోసారి దాడులకు ఆదేశాలు ఇవ్వొచ్చన్న ఊహాగానాలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
చైనా నుంచి తిరుగు ప్రయాణంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్, ఇరాన్ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నానని తెలిపారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఇరాన్ అంశంపై చర్చించానని చెప్పినా, రాజీకి ఒప్పించాలని మాత్రం కోరలేదని స్పష్టం చేశారు. దీంతో ట్రంప్ తదుపరి నిర్ణయంపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!