

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ ట్రాఫికింగ్ కేసుకు సంబంధించిన ఫైళ్లు ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రత్యేక రీడింగ్ రూమ్ ఏర్పాటు చేసి, ట్రైబెకా ప్రాంతంలో ఈ డాక్యుమెంట్లను ప్రదర్శనకు ఉంచారు. మే 8 నుంచి 21 వరకు అపాయింట్మెంట్ తీసుకున్నవారికి ఈ ఫైళ్లను చదివే అవకాశం కల్పించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
ఈ కేసుకు సంబంధించిన సుమారు 3.5 మిలియన్ ఫైళ్లను దశలవారీగా అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రైమరీ ఫ్యాక్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్లో 3,700 వాల్యూమ్స్ను “డొనాల్డ్ జె ట్రంప్ అండ్ జెఫ్రీ ఎప్స్టీన్ మెమోరియల్ రీడింగ్ రూమ్” పేరిట అందుబాటులో ఉంచారు. డొనాల్డ్ ట్రంప్ మరియు ఎప్స్టీన్ మధ్య ఉన్న సంబంధాలు, కేసుకు సంబంధించిన వివిధ అంశాలు ఇందులో ప్రదర్శించబడుతున్నాయి. బాధితులకు మద్దతు తెలపడం, న్యాయం కోసం పోరాటానికి అవగాహన పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!