
జనరల్

కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ. గఫూర్ పెద్ద కుమారుడు కిరణ్ వెంకట పల్ల అమెరికాలోని శాన్ హోసేలో గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు. ఆయన అకాల మరణవార్త కర్నూలు ప్రజలను, ఎన్నారై వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసింది.
ఈ క్లిష్ట సమయంలో గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ గురురాజా నాయకత్వంలోని బృందం సహాయక చర్యలు చేపట్టింది. భక్త భల్ల, ఫహద్ సయ్యద్, అబ్దుల్ ఖుద్దూస్, సాయి బొల్లినేనిలతో కూడిన ఈ బృందం స్థానికంగా అవసరమైన అధికారిక అనుమతులు, ఇతర ప్రక్రియలను త్వరగా పూర్తి చేసేందుకు సమన్వయం చేస్తోంది. కిరణ్ భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా కర్నూలుకు తరలించేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!