

జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న ఆహార కలుషిత ఘటనలు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. ఇటీవల పానీపూరి తిని పలువురు చిన్నారులు అస్వస్థతకు గురికావడం, స్వీట్ షాప్‌లో తినుబండారాల్లో బల్లి కళేబరం బయటపడటం, హోటల్‌లో మండి బిర్యాని తిని పలువురు ఆసుపత్రి పాలవడం వంటి సంఘటనలు ఆహార భద్రతపై అనేక సందేహాలకు తావిస్తున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఫుడ్ సేఫ్టీ అధికారులు పలుమార్లు తనిఖీలు నిర్వహించి ఆహార నమూనాలను సేకరించినప్పటికీ, గత రెండు నెలలుగా పరీక్షల ఫలితాలు వెల్లడించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆహార విక్రయ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. శానిటరీ విభాగం, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తరచూ తనిఖీలు నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!