
సినిమాలు

ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ కాలువ మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయడానికి షార్ట్ టెండర్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రూ.10 లక్షల విలువ కలిగిన పనులు ఇప్పటివరకు నామినేషన్ పద్ధతిలో సాగునీటి సంఘాల సమాఖ్యల ద్వారా నిర్వహించబడుతున్నాయి. అయితే పెద్ద మొత్తంలో పెండింగ్ పనులు ఉన్న నేపథ్యంలో కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
రూ.10 లక్షలకు పైగా విలువైన సుమారు 6502 పనులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పనులను వానాకాలానికి ముందే పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు సమీక్షలో ఆదేశించారు. ఏడు రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి అయ్యేలా షార్ట్ టెండర్లు పిలిచి పనులు అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. వేగంగా పనులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!