

ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవ్యవస్థలో కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. ఇందులో భాగంగా సాధారణ కోర్టు పనివేళలు ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేకంగా కేసుల విచారణ చేపట్టే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. న్యాయస్థానాల్లో పేరుకుపోతున్న కేసుల సంఖ్యను తగ్గించి, ప్రజలకు సత్వర న్యాయం అందించడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశం.
ఈ ప్రయోగాత్మక విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌తో పాటు బిహార్, ఢిల్లీలోనూ పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం పదవీ విరమణ చేసిన న్యాయమూర్తుల సేవలను వినియోగించుకునే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే సాధారణ పనివేళల తర్వాత కూడా కేసుల విచారణ కొనసాగి, పెండింగ్ కేసుల పరిష్కారానికి మరింత అవకాశం లభించనుంది. అయితే ఈ ప్రతిపాదన అమలు, విధివిధానాలపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!