

ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. మద్యం రవాణాతో సంబంధం ఉన్న నలుగురిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. వారిలో రాయపాటి పురుషోత్తమరావు, మర్రి సుబ్బారెడ్డి, రమేష్ ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరఫరా చేసేందుకు సిగ్మా, ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చినట్లు సమాచారం. తొలి కాంట్రాక్టు కాలంలో మర్రి సుబ్బారెడ్డి, రాయపాటి పురుషోత్తమరావు కలిసి సుమారు 59.14 లక్షల మద్యం పెట్టెలను రవాణా చేసిన అంశంతో పాటు, సిగ్మా సంస్థ నుంచి రూ.15.44 కోట్లు పొందినట్లు వచ్చిన ఆరోపణలపై ఈడీ ప్రశ్నలు వేస్తోంది.
మద్యం రవాణా సబ్‌కాంట్రాక్టులు, నిధుల మళ్లింపు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో ఉన్న సంబంధాలపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. రాయపాటి పురుషోత్తమరావు, మర్రి సుబ్బారెడ్డి ఇచ్చిన వాంగ్మూలాలను ఈడీ, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నమోదు చేస్తున్నాయి. రవాణా ఛార్జీలను అధికంగా పెంచడం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.195 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశాలపై విచారణ ఇంకా కొనసాగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!