
ఓటీటీ

దేశవ్యాప్తంగా భూ రికార్డుల ఆధునీకరణలో భాగంగా డ్రోన్ ఆధారిత సర్వేలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటివరకు 3.30 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వేలు పూర్తయ్యాయి. ఈ ప్రక్రియ ద్వారా 3.24 కోట్లకు పైగా ఆస్తి పత్రాలను పంపిణీ చేశారు. డిజిటల్ మ్యాపులు రూపొందించడం, భూముల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడంలో ఈ సాంకేతికత కీలకంగా మారుతోంది.
తెలంగాణలో ఐదు పైలట్ గ్రామాల్లో డ్రోన్ సర్వేలు పూర్తి కాగా, రికార్డులు, పాత మ్యాపులు అందుబాటులో లేని గ్రామాలను గుర్తించి ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. వ్యవసాయ భూములతో పాటు హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ పరిధిలోని ఇళ్లు, ఖాళీ స్థలాల మ్యాపింగ్‌కు కూడా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!