
సినిమాలు

ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో ఒక హెలికాప్టర్ చక్కర్లు కొట్టడం భక్తుల్లో, దేవస్థాన అధికారుల్లో ఆందోళన కలిగించింది. ఈ ఘటనతో తిరుమలను విమానాల రాకపోకలకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది.
ఆలయంపైగా హెలికాప్టర్లు, విమానాలు ప్రయాణించడం ఆగమ శాస్త్రాలకు విరుద్ధమని తిరుమల తిరుపతి దేవస్థానాలు పలుమార్లు కేంద్ర పౌర విమానయాన శాఖను కోరాయి. ఈ అంశంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి కూడా గతంలో లేఖ రాసింది. తిరుమలను విమానాల రాకపోకలకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించే అంశంపై త్వరలో అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!