
జనరల్

పోలవరం ప్రాజెక్టుపై నేడు కీలక సమావేశం జరగనుంది. ఇటీవల ప్రాజెక్టు ప్రాంతాలు, ముంపు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడం, ముంపు బాధితుల పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది.
ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలు, ముంపు ప్రభావం, రాష్ట్రాల మధ్య సమన్వయం వంటి కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. పూర్తి సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. రెండో దశ భూసేకరణ, పునరావాస ప్యాకేజీలపై కూడా సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. భద్రాచలం ముంపు అంశంపై వచ్చిన అభ్యంతరాల పరిష్కార మార్గాలపై కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!