

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించినప్పటికీ పంటల కొనుగోలు పరంగా తగిన స్థాయిలో ముందుకు రావడం లేదని విమర్శించారు. హమాలీల కొరత, ఎండల ప్రభావం కారణంగా కొనుగోళ్లలో కొంత ఇబ్బంది ఏర్పడినప్పటికీ, ధాన్యం సేకరణపై నిరంతరం సమీక్ష చేస్తున్నామని తెలిపారు.
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిర్వాసితులకు స్థానికంగానే నివాసాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సన్నవడ్లకు రూ.500 బోనస్, మొక్కజొన్నకు మద్దతు ధర చెల్లిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూ నాణ్యమైన విద్య అందించేందుకు పలు సంస్కరణలు చేపడుతున్నామని చెప్పారు. విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, భోజనం అందిస్తూ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!