

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యాశాఖతో రహేజా గ్రూప్, రాంకీ ఫౌండేషన్, యశోదా ఫౌండేషన్ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సామాజిక బాధ్యత కార్యక్రమం కింద ఈ సంస్థలు పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు అందించనున్నాయి. కార్యక్రమంలో రహేజా గ్రూప్ అధ్యక్షుడు నీల్ సి. రహేజా, రాంకీ ఫౌండేషన్ ప్రతినిధులు, యశోదా గ్రూప్ ప్రతినిధులు పాల్గొన్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్‌లో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్ వరకు కొత్త విద్యా ప్రాంగణ నిర్మాణానికి రాంకీ సంస్థ రూ.19.66 కోట్లు ఖర్చు చేయనుంది. మహేశ్వరం మండలం తుక్కుగూడలో పాఠశాల ఉన్నతీకరణ కోసం మరో రూ.10.4 కోట్లు వెచ్చించనుంది. అలాగే రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతుల నిర్మాణానికి రహేజా గ్రూప్ రూ.50.50 కోట్లు అందించనుండగా, ఉప్పల్ సుభాష్ నగర్ పాఠశాల అభివృద్ధికి యశోదా సంస్థ రూ.12.20 కోట్లు ఖర్చు చేయనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!