

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నూతన భారత నిర్మాణంలో బొగ్గు రంగం అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి వారం బొగ్గు ఉత్పత్తి, సరఫరా పరిస్థితులను సమీక్షిస్తున్నారని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బొగ్గు రంగంలో పలు కీలక సంస్కరణలు అమలు చేసి దేశ ఇంధన భద్రతను బలోపేతం చేసిందని చెప్పారు.
ప్రస్తుతం దేశంలో 189 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, చైనా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా వంటి దేశాల నుంచి బొగ్గు దిగుమతులను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్‌పై అధ్యయనాలు కొనసాగుతున్నాయని, ఈ నెల 11న ప్రైవేట్ సంస్థలతో చర్చలు జరపనున్నట్లు తెలిపారు. క్రిటికల్ మినరల్స్ మిషన్ కోసం రూ.1,500 కోట్లు కేటాయించామని, ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న 24 కీలక ఖనిజాల్లో భాగంగా అర్జెంటీనాలో ఆరు ఖనిజ బ్లాకులను సొంతం చేసుకున్నామని పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!