
క్రీడలు

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 12న మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని దాదాపు 235 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో వ్యవసాయం, సాగునీరు, తాగునీటి సరఫరా, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌తో పాటు పరిస్థితిని ఎదుర్కొనేందుకు తక్షణం చేపట్టాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది.
కరువు ప్రభావిత మండలాలను ప్రకటించడంతో పాటు, రాష్ట్రానికి తగిన ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కేంద్రాన్ని కోరింది. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో జరగనున్న సమావేశంలో పరిస్థితిని సమీక్షించి, రైతులు, ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!