

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ మరియు వరంగల్ ఎయిర్‌పోర్ట్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. హైదరాబాద్–పుణే, హైదరాబాద్–బెంగళూరు హైస్పీడ్ రైల్వే మార్గాల్లో వికారాబాద్ అనంతగిరి, మన్ననూర్, సోమశిల సమీపాల్లో స్టేషన్లు ఏర్పాటు చేయాలని, ఐటీ హబ్‌లకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలని సీఎం సూచించారు.
హైదరాబాద్ (శంషాబాద్)ను బుల్లెట్ ట్రైన్ హబ్‌గా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్ డిజైన్‌లో కాకతీయ సామ్రాజ్యం వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించాలని సూచించారు. ఎయిర్‌పోర్ట్ ముందు భారీ ఐలాండ్‌లో రాణి రుద్రమ దేవి, రుద్రదేవుడు విగ్రహాలతో పాటు నంది విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పారు. డిజైన్లపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లి ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులతో సమావేశం కావాలని ఆదేశించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!