

నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో ఎమ్మెల్యే శంకర్ పాత్రలో నటించిన ప్రియదర్శి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఆయన పాత్రలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగ శైలిని పోలిన సంభాషణలు, హావభావాలు కనిపించడంతో అభిమానులు ఆసక్తిగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ యాసలో ప్రియదర్శి నటన ఆకట్టుకుంటోందంటూ ఫ్యాన్స్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు.
మరోవైపు ‘ది ప్యారడైజ్’ బుకింగ్స్‌లోనూ జోరు కొనసాగిస్తోంది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఇప్పటివరకు 15 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు చిత్ర బృందం తెలిపింది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ చిత్రం రూ.60 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో నాని కెరీర్‌లో ఈ చిత్రం భారీ ఓపెనింగ్‌ను నమోదు చేస్తుందనే అంచనాలతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!