

బిగ్ బాస్ తెలుగు 10 రోజురోజుకూ మరింత ఆసక్తికరంగా మారుతోంది. టాస్కులు, గొడవలు, స్నేహాలు, బాండింగ్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా కొన్ని వారాల తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండగా, ఈసారి మాత్రం ముందుగానే కొత్త కంటెస్టెంట్లను హౌస్‌లోకి తీసుకురావడానికి నిర్వాహకులు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. నవరసాలు రామకృష్ణ, మిథిలేష్, అపూర్వ పేర్లు వైల్డ్ కార్డు ఎంట్రీల కోసం వినిపిస్తున్నాయి. వీరంతా సీజన్‌కు ముందు జరిగిన ‘అగ్నిపరీక్ష’ కార్యక్రమంతో సంబంధం ఉన్నవారేనని తెలుస్తోంది.
వీరి ఎంట్రీకి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ముగ్గురూ అన్నపూర్ణ స్టూడియోస్‌కు వెళ్లినట్లు సమాచారం. అయితే వీరిని నేరుగా హౌస్‌లోకి పంపిస్తారా? లేక ప్రత్యేక టాస్కులు నిర్వహించి ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా ఒకరు లేదా ఇద్దరిని ఎంపిక చేస్తారా? అనేది ఇంకా స్పష్టత లేదు. ముఖ్యంగా అపూర్వ ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. ‘అగ్నిపరీక్ష’ సమయంలో అపూర్వ, రోహిత్ మధ్య మంచి అనుబంధం ఏర్పడినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం రోహిత్, శాలిని మధ్య మంచి బాండింగ్ కనిపిస్తున్న నేపథ్యంలో అపూర్వ హౌస్‌లోకి వస్తే కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే ఈ వైల్డ్ కార్డు ఎంట్రీలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!