
బిజినెస్

బ్యాంకు ఉద్యోగులు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు సమ్మెకు వెళ్లనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్ మొత్తాలను ముందుగానే చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 25నే ఈ మొత్తాలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఈ ముందస్తు చెల్లింపు విధానం డిఫెన్స్, పోస్టల్, టెలికమ్యూనికేషన్ విభాగాల ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా వర్తించనుంది. సెప్టెంబర్ 25న జమ చేసే మొత్తాన్ని అడ్వాన్స్ పేమెంట్‌గా పరిగణిస్తారు. తుది లెక్కలు ఖరారైన తర్వాత అక్టోబర్ నెల చెల్లింపులో మిగిలిన మొత్తాన్ని సర్దుబాటు చేయనున్నారు. బ్యాంకుల సమ్మె కారణంగా జీతాలు, పెన్షన్ల చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!