

విజయవాడలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల మిషన్ కర్మయోగి ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అంబేద్కర్ కళావేదికలో జరుగుతున్న ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్యాలను పెంపొందించడం, పరిపాలనా నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ శిక్షణ సంస్థల సామర్థ్యాల పెంపు, ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై సదస్సులో చర్చిస్తున్నారు.
ఉన్నతి కార్యక్రమం ద్వారా ఉద్యోగుల సామర్థ్యాల పెంపునకు ఐగాట్, మిషన్ కర్మయోగి క్వాలిటీ ఫ్రేమ్‌వర్క్ భాగస్వామ్యంతో ముసాయిదా రూపొందించనున్నారు. వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. శిక్షణ సంస్థలు కేవలం కోర్సులు నిర్వహించే కేంద్రాలుగా కాకుండా, ఆయా శాఖల పనితీరును మెరుగుపరిచే విధంగా పనిచేసేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్‌లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా, కర్ణాటక రెండో స్థానం, ఒడిశా మూడో స్థానంలో నిలిచాయి. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆయా రాష్ట్రాల ప్రతినిధులు అవార్డులు అందుకున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!