

‘ఓట్ చోరీ’ వివాదంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చేసిన సమావేశ అభ్యర్థనను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తిరస్కరించినట్లు సమాచారం. ఈ వివాదంపై ఎన్నికల సంఘం స్పందించాలని కోరుతున్న ప్రతిపక్ష నేతలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను రద్దు చేయడంతో పాటు, పేపర్ బ్యాలెట్ల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని కూడా వారు కోరుతున్నారు.
తమ నిరసనలను మరింత ఉధృతం చేయడంలో భాగంగా ప్రతిపక్ష పార్టీలు సోమవారం సుప్రీంకోర్టు వరకు ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ‘చలో ఢిల్లీ – ప్రజాస్వామ్యం కోసం మార్చ్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ఓటర్ల జాబితాల సవరణ, ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై తమ అభ్యంతరాలను ఈ ర్యాలీ ద్వారా తెలియజేయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!