
జనరల్

కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అమరావతి–హైదరాబాద్‌ను కలిపే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నంలో జరిగిన గూగుల్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీ మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు.
ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం అమరావతి నుంచి హైదరాబాద్‌కు కేవలం 70 నిమిషాల్లో, చెన్నైకి 112 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!