
గాసిప్స్

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆస్తులకు సంబంధించిన అంశంపై ఈడీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. గతంలో పొంగులేటికి సంబంధించిన ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈడీ కార్యాలయంలోకి వెళ్లేందుకు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కార్యాలయం గేట్ వద్ద పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు గేట్ ముందే కూర్చొని నిరసన కొనసాగించారు. ఈడీ సోదాలకు సంబంధించిన తదుపరి చర్యలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!