

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తర్వాత మరో యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ‘డేర్ డెవిల్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంతో అజిత్ భార్య, నటి షాలిని అజిత్ కుమార్ నిర్మాతగా పరిచయం కానున్నారు. నవంబర్ 2 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్ల ఎంపికపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తొలుత పూజా హెగ్డే, శ్రీలీల పేర్లను పరిశీలించినప్పటికీ, వివిధ కారణాలతో వారు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం అజిత్ సరసన కీలక పాత్రల కోసం ఆషికా రంగనాథ్, ఆండ్రియా జెరెమియాలతో మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరినీ దాదాపు ఖరారు చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే హీరోయిన్ల ఎంపికపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అజిత్‌తో ఆషికా, ఆండ్రియా కాంబినేషన్ ఖరారైతే సినిమాపై మరింత ఆసక్తి నెలకొనే అవకాశం ఉంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!