14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ.. మంత్రి సీతక్క

Writer: Shivani K 04:40 PM, 14 అక్టోబర్, 2026
తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ.. మంత్రి సీతక్క

ఖైరతాబాద్‌లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరుకాగా, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్‌తో పాటు పెద్ద సంఖ్యలో మహిళా సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు మంత్రి సీతక్కకు ఆప్యాయంగా బొట్టు పెట్టి, బట్టలు అందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే గాంధీభవన్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లోనూ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్న సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటున్నామని ఆమె తెలిపారు. బతుకమ్మ వేడుకల ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు.

బతుకమ్మ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అని మంత్రి సీతక్క అన్నారు. అడుక్కునే స్థాయి నుంచి శాసించే స్థాయికి మహిళలు ఎదగాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష అని తెలిపారు. పూర్వీకులు అందించిన సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చెరువులకు, ప్రకృతికి పూలతో పూజలు చేసే బతుకమ్మ పండుగ మహిళల మధ్య ఆత్మీయతను పెంపొందిస్తుందని వివరించారు. దేశవిదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ మహిళలు సైతం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఆస్తులు, పదవులు వస్తూ పోతూ ఉంటాయని, కానీ సంస్కృతి, సంప్రదాయాలు కోల్పోతే తిరిగి పొందడం కష్టమని పేర్కొన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తోందని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సతీమణితో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్

ట్రంప్‌–బీబీసీ పరువు నష్టం కేసులో కీలక పరిణామం

విజయవాడ సరస్ మేళాకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము

పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

ప్రపంచంలో అత్యధిక క్రైమ్ ఇండెక్స్ ఉన్న దేశం ఇదే.. టాప్‌ 10లో ఏయే దేశాలంటే?

ట్యాగ్లు
బతుకమ్మమంత్రి సీతక్కతెలంగాణ సంస్కృతిమహిళా సాధికారతబతుకమ్మ సంబరాలురేవంత్ రెడ్డిపంచాయతీరాజ్ శాఖదివ్య దేవరాజన్తెలంగాణ సంప్రదాయాలుమహిళల ఆత్మగౌరవం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’?
ఓటీటీ

ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’?

సతీమణితో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్
జనరల్

సతీమణితో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ.. మంత్రి సీతక్క
జనరల్

తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ.. మంత్రి సీతక్క

కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా దాతలు నిధులు ఇస్తున్నారంటూ మేరీ మిల్బెన్ ఆరోపణలు
రాజకీయాలు

కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా దాతలు నిధులు ఇస్తున్నారంటూ మేరీ మిల్బెన్ ఆరోపణలు

ట్రంప్‌–బీబీసీ పరువు నష్టం కేసులో కీలక పరిణామం
జనరల్

ట్రంప్‌–బీబీసీ పరువు నష్టం కేసులో కీలక పరిణామం

మెటా మ్యూస్ వండర్‌లో యాక్టివ్ మెమరీ, యాక్టివ్ ఫోకస్‌.. ఏం చేయగలవంటే?
టెక్నాలజీ

మెటా మ్యూస్ వండర్‌లో యాక్టివ్ మెమరీ, యాక్టివ్ ఫోకస్‌.. ఏం చేయగలవంటే?

సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘డోంట్ స్లీప్’ టీజర్
సినిమాలు

సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘డోంట్ స్లీప్’ టీజర్

విజయవాడ సరస్ మేళాకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము
జనరల్

విజయవాడ సరస్ మేళాకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము

బిగ్ బాస్ 10: రోహిత్–శాలిని మధ్య విభేదాలు.. బ్రేకప్ రూమర్స్‌కు కారణమిదేనా?
షోస్

బిగ్ బాస్ 10: రోహిత్–శాలిని మధ్య విభేదాలు.. బ్రేకప్ రూమర్స్‌కు కారణమిదేనా?

పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం
జనరల్

పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?
సినిమాలు

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!