
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా పరిశీలన కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 43 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 16 లక్షలకు పైగా ఓటర్ల విచారణ పూర్తయినట్లు తెలిపారు. సరైన పత్రాలు సమర్పించని కారణంగా విచారణ అనంతరం 8,700 మందిని అనర్హులుగా గుర్తించినట్లు సమాచారం.
మరోవైపు, పరిశీలనలో అర్హత నిర్ధారణ అయిన 13 లక్షల మందికి పైగా ఓటర్లను తుది జాబితాలో కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన నోటీసులపై విచారణ ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఓటర్ల వివరాల ఖచ్చితత్వాన్ని నిర్ధారించడంతో పాటు అర్హులైన ప్రతి ఓటరుకు తుది జాబితాలో చోటు కల్పించేలా ప్రక్రియ సాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!