

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మొత్తం 2,721 టీచర్ పోస్టుల భర్తీ కోసం జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) షార్ట్ నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని వేలాది మంది అభ్యర్థులలో కొత్త ఉత్సాహం నెలకొంది.
2026 అక్టోబర్ 13న విడుదలైన నోటిఫికేషన్ ద్వారా సాధారణ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT), స్కూల్ అసిస్టెంట్ (SA) కేటగిరీలలో 2,111 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో SGT, SA కేటగిరీలలో మరో 350 పోస్టులను, సొసైటీస్ కేటగిరీలో 260 పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. పోస్టుల వారీగా ఖాళీలు, రిజర్వేషన్ల వివరాలు, ఇతర ముఖ్య సమాచారంతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను మరో మూడు వారాల్లో విడుదల చేసే అవకాశం ఉంది.రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగా, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే ఈ ప్రకటన వెలువడింది. పూర్తి నోటిఫికేషన్ తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!