

విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తమిళనాడు సీఎం విజయ్ దళపతి సీఎంగా గెలిచాక మొదటి సారిగా విజయవాడ వచ్చారు. ఆయన్ను దుర్గమ్మే ఇక్కడకు పిలిపించిందన్నారు. తమిళనాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో విజయ్ పని చేస్తున్నారు. పార్టీ పెట్టి రెండేళ్లలోనే సీఎం అయ్యారు. యువత ఉత్సాహం చూస్తుంటే మన దేశ యువత ప్రపంచంలో ఏదైనా సాధించగలరన్న నమ్మకం కలిగింది. రాష్ట్రాల వేరైనా మా అభిమతం ఒక్కటే...దేశం బాగుపడాలి...తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్నాటక అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. ప్రధాని మోదీ నాయకత్వంలో ఏదైనా సాధ్యం అవుతుంది. గోదావరి-కావేరి నదుల అనుసంధానం జరుగుతుంది. పెన్నా, గోదావరి, కృష్ణా, కావేరి నదులు కలిస్తే 4 రాష్ట్రాలు బాగుపడతాయి.2047కు ప్రపంచలోనే భారత్ నెంబర్-1 అవుతుందనడంలో అనుమానం లేదు. ఉత్సవాలకు హాజరైన విజయ్ దళపతికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు.
విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొని ప్రసంగించిన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ మాట్లాడుతూ మీ అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నదుల అనుసంధానం గురించి సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు విజయవాడ వచ్చాను. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.మీ ఆతిధ్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని సీఎం విజయ్ తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!