1, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రధాన నిర్ణయాలతో ఏపీ మంత్రివర్గ సమావేశం… గృహాలు, ఆసుపత్రులు, రాజధాని అభివృద్ధికి కీలక ఆమోదాలు!

Writer: Chandrika 07:27 AM, 29 జనవరి, 2026
ప్రధాన నిర్ణయాలతో ఏపీ మంత్రివర్గ సమావేశం… గృహాలు, ఆసుపత్రులు, రాజధాని అభివృద్ధికి కీలక ఆమోదాలు!

రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని 2.61 లక్షల టిడ్కో ఇళ్లను జూన్‌ నాటికి పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం హడ్కో నుంచి ఏపీ టిడ్కో తీసుకునే రూ.4,451 కోట్ల రుణానికి ప్రభుత్వ హామీ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే పిడుగురాళ్ల బోధనాసుపత్రిని ప్రభుత్వమే నిర్వహించనుండగా, ప్రస్తుతం ఉన్న 330 పడకలను 420 పడకలకు పెంచేందుకు, అవసరమైన పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశ వివరాలను పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు.

అదేవిధంగా చిత్తూరు జిల్లా పలమనేరులో కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు 33 ఎకరాల భూమి బదలాయింపు, అభివృద్ధి జరగని కారణంగా గార్డెన్‌సిటీ రియాలిటీకి ఇచ్చిన ఎల్‌ఓఐ రద్దు, గుంటూరు శిల్పారామంలో కల్చరల్ సెంటర్ అభివృద్ధికి అనుమతి లభించింది. అర్జున అవార్డు గ్రహీత యర్రాజి జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం, డిగ్రీ పూర్తయ్యాక గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. అన్నమయ్య జిల్లాలో కేంద్రీయ విద్యాలయానికి 6.09 ఎకరాల ఉచిత భూకేటాయింపు, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‌కు అదనంగా రూ.11,850 కోట్ల రుణం, పోలవరం ప్రాజెక్టు కోసం రూ.247.12 కోట్లతో రాయి తవ్వకాలకు ఆమోదం తెలిపారు. అమరావతిలో వాస్తు అభ్యంతరాలున్న 112 ప్లాట్లను రద్దు చేసి లాటరీ ద్వారా కొత్త ప్లాట్లు కేటాయించే అధికారాన్ని సీఆర్‌డీఏ కమిషనర్‌కు అప్పగిస్తూ తీర్మానం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దారితప్పిన యువతను శిక్షించడం కాదు.. సరైన మార్గంలో నడిపిద్దాం: ప్రధాని మోదీ

దారితప్పిన యువతను శిక్షించడం కాదు.. సరైన మార్గంలో నడిపిద్దాం: ప్రధాని మోదీ

పంటల బీమాపై కేంద్రం కీలక నిర్ణయం..

పంటల బీమాపై కేంద్రం కీలక నిర్ణయం..

నేటి నుంచి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింపు

నేటి నుంచి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింపు

ములుగులో ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక

ములుగులో ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

మెట్రో ప్రయాణీకుల సౌకర్యంపై సీఎస్ సంజయ్ జాజు ఫోకస్

మెట్రో ప్రయాణీకుల సౌకర్యంపై సీఎస్ సంజయ్ జాజు ఫోకస్

ట్యాగ్లు
ఏపీ మంత్రివర్గంచంద్రబాబు నాయుడుటిడ్కో ఇళ్లుఅమరావతి రాజధానిపోలవరం ప్రాజెక్టుప్రభుత్వ నిర్ణయాలుగృహ నిర్మాణంఆంధ్రప్రదేశ్ వార్తలుక్యాబినెట్ సమావేశం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గోదావరి వరదలపై హై అలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
జనరల్

గోదావరి వరదలపై హై అలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

పులి మృతి కలకలం.. సమగ్ర విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశం
జనరల్

పులి మృతి కలకలం.. సమగ్ర విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశం

సూపర్ స్టార్ బర్త్‌డే ట్రీట్ రెడీనా?..
సినిమాలు

సూపర్ స్టార్ బర్త్‌డే ట్రీట్ రెడీనా?..

దారితప్పిన యువతను శిక్షించడం కాదు.. సరైన మార్గంలో నడిపిద్దాం: ప్రధాని మోదీ
జనరల్

దారితప్పిన యువతను శిక్షించడం కాదు.. సరైన మార్గంలో నడిపిద్దాం: ప్రధాని మోదీ

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ జోరు...
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ జోరు...

పంటల బీమాపై కేంద్రం కీలక నిర్ణయం..
జనరల్

పంటల బీమాపై కేంద్రం కీలక నిర్ణయం..

నేటి నుంచి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింపు
జనరల్

నేటి నుంచి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింపు

ములుగులో ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక
జనరల్

ములుగులో ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక

కామన్వెల్త్ జావెలిన్ ఫైనల్లో నీరజ్ చోప్రాకు రజత పతకం
క్రీడలు

కామన్వెల్త్ జావెలిన్ ఫైనల్లో నీరజ్ చోప్రాకు రజత పతకం

భారత్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే
సినిమాలు

భారత్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే

కియారాకు సిద్ధార్థ్ ప్రేమతో బర్త్‌డే విష్.. అభిమానుల మనసులు దోచుకున్న పోస్ట్
సినిమాలు

కియారాకు సిద్ధార్థ్ ప్రేమతో బర్త్‌డే విష్.. అభిమానుల మనసులు దోచుకున్న పోస్ట్

‘ఒడిస్సీ’పై కమల్ హాసన్ ప్రశంసలు...
సినిమాలు

‘ఒడిస్సీ’పై కమల్ హాసన్ ప్రశంసలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!