
జనరల్
.jpg)
విశాఖపట్నం నగరంలోని మధురవాడ (రుషికొండ) ఐటీ హిల్స్ ప్రాంతంలో కొత్త గ్రేడ్-1 ఐటీ పార్క్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం హిల్-3 వెనుక భాగంలో సుమారు 30 ఎకరాల భూమిని ప్రభుత్వం విజాగ్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కేటాయించినట్లు సమాచారం. ఈ ఐటీ పార్క్ ఏర్పాటుతో విశాఖలో ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా సంస్థ మూడు దశల్లో సుమారు రూ.2,200 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దాదాపు 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు నిర్మించనున్నారు. దీని ద్వారా సుమారు 30 వేల మందికి ఉద్యోగావకాశాలు కలగనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అమరావతిలో కూడా రూ.300 కోట్ల పెట్టుబడితో ‘జేవియర్’ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇది రాష్ట్రంలో విద్యా మరియు ఐటీ రంగాల అభివృద్ధికి తోడ్పడనుంది.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!