
ఓటీటీ

పనామా దేశంలో సోమవారం మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదైనట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది. భూమికి సుమారు 35 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలిపింది. ఇటీవల సంభవించిన భారీ భూకంపం నుంచి కోలుకుంటున్న పనామాలో తాజా ప్రకంపనలు ఆందోళనకు గురిచేశాయి.
గత శుక్రవారం పనామాలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 900 భవనాలు కూలిపోగా, 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ప్రాథమిక సమాచారం వెల్లడించింది. ప్రధాన భూకంపం తర్వాత దాదాపు 300 ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో పనామా ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించి సహాయక చర్యలు చేపట్టింది. లాస్ శాంటోస్, కోక్లే, హెర్రెరా ప్రాంతాల్లో భూకంప ప్రభావం అధికంగా ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!