
జనరల్

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతాన్ని సందర్శించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం పలు కీలక కార్యక్రమాలు చేపడుతోందని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మావోయిస్టు ప్రభావాన్ని గణనీయంగా తగ్గించామని, ఇప్పుడు బస్తర్‌ను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.
బస్తర్‌లోని 70 భద్రతా క్యాంపులను దశలవారీగా సేవా కేంద్రాలుగా మార్చనున్నట్లు అమిత్ షా వెల్లడించారు. గుజరాత్ తరహా అభివృద్ధి మోడల్‌ను బస్తర్‌లో అమలు చేస్తామని, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, క్రీడలకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. స్థానిక గిరిజన యువతకు ఒలింపిక్స్ స్థాయి క్రీడల్లో అవకాశాలు కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!