
రాజకీయాలు

జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అమర్‌నాథ్, వైష్ణోదేవి యాత్రలను తాత్కాలికంగా నిలిపివేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పహల్గామ్, బాల్తాల్ మార్గాల్లో నేటి నుంచి భక్తుల అనుమతిని రద్దు చేశారు. యాత్రికులను బేస్ క్యాంపుల వద్దనే నిలిపివేస్తున్నారు.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల ప్రకారం జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా నేటి నుంచి ఈ నెల 23 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు వైష్ణోదేవి దర్శనాలను కూడా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!