
సినిమాలు

జూలై నెలలో కొత్త మొబైల్ వినియోగదారులను చేర్చుకోవడంలో భారతీ ఎయిర్‌టెల్ జియోపై పైచేయి సాధించింది. ట్రాయ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, జూలైలో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌కు 26.8 లక్షల మంది కొత్త మొబైల్ యూజర్లు చేరారు. ఇదే సమయంలో జియోకు 24.4 లక్షల మంది వినియోగదారులు జతయ్యారు. వొడాఫోన్ ఐడియాకు 2.4 లక్షల మంది, బీఎస్‌ఎన్‌ఎల్‌కు 1.68 లక్షల మంది కొత్త యూజర్లు చేరారు.
దేశవ్యాప్తంగా జూలైలో మొత్తం 55.38 లక్షల వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లు పెరగడంతో మొత్తం సంఖ్య 128.79 కోట్లకు చేరింది. ఇందులో జియోకు 50.60 కోట్ల మంది, ఎయిర్‌టెల్‌కు 48.94 కోట్ల మంది, వొడాఫోన్ ఐడియాకు 19.90 కోట్ల మంది వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. మరోవైపు బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 108.75 కోట్ల నుంచి 109.44 కోట్లకు పెరిగింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!