

2026 దసరా బాక్సాఫీస్ పోటీ రోజురోజుకూ మారుతోంది. తొలుత జైలర్ 2, విశ్వంభర, ఆదర్శ కుటుంబం వంటి భారీ చిత్రాలు ఒకేసారి బరిలోకి దిగుతాయని భావించారు. అయితే సీజీ, విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో ఆలస్యం కారణంగా చిరంజీవి నటిస్తున్న విశ్వంభర దసరా రేసు నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు రజినీకాంత్ జైలర్ 2 విడుదల తేదీపై కూడా ఇంకా స్పష్టత కనిపించడం లేదు.
ఈ పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 19వ శతాబ్దపు పీరియడ్ యాక్షన్ డ్రామా రణబాలి అక్టోబర్ 16, 2026న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విజయ్–రష్మిక మందన్న జంటగా పెళ్లి తర్వాత వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి పెరిగింది. ఇతర భారీ చిత్రాలు తప్పుకుంటే దసరా సెలవుల్లో రణబాలికి మంచి థియేట్రికల్ స్పేస్ దక్కే అవకాశం ఉందని, ఈ సినిమా విజయ్ కెరీర్‌కు కీలకమైన విజయాన్ని అందించవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!