

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘రాకా’ షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు బయటకు రాకుండా మేకర్స్ అత్యంత గోప్యత పాటిస్తున్నారని తెలుస్తోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలో అల్లు అర్జున్ తండ్రి, ఇద్దరు కొడుకులుగా మూడు పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఒక పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ఉండనుందని టాక్ వినిపిస్తోంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ పాన్-ఇండియా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌కు సంబంధించి త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!