24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 130 సీట్లు అడుగుతున్న కాంగ్రెస్

Writer: Harika S 07:54 AM, 24 నవంబర్, 2026
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 130 సీట్లు అడుగుతున్న కాంగ్రెస్

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వాములైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య సీట్ల పంపకాల చర్చలు ఆసక్తికరంగా మారాయి. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు దాదాపు 130 స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ నివాసంలో ఇరు పార్టీల నేతలు సమావేశమయ్యారు. సుమారు 15 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ నేతలు తమకు కావాల్సిన అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాను సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధులకు అందించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక స్థానంలో పోటీ చేసేలా కాంగ్రెస్ ఈ జాబితాను సిద్ధం చేసింది. ముఖ్యంగా అమేథీ, రాయ్‌బరేలీ ప్రాంతాల్లోని అన్ని అసెంబ్లీ స్థానాలను తమకు కేటాయించాలని కోరింది. కాంగ్రెస్ ఇన్ని స్థానాలు డిమాండ్ చేయడంతో సమావేశానికి వచ్చిన ఎస్పీ నేతలు నిర్ణయం తీసుకోలేకపోయారు.

ఈ జాబితాపై అఖిలేశ్ యాదవ్‌తో చర్చించి, ఆ తర్వాత తదుపరి సమావేశంలో తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని కాంగ్రెస్ నేతలకు ఎస్పీ నాయకులు చెప్పినట్టు తెలుస్తోంది . మంగళవారం మరోసారి చర్చలు జరగనున్నాయి. సమావేశం కేవలం 15 నిమిషాలే జరిగినప్పటికీ ఇరు పార్టీల నేతలు చర్చలు సానుకూలంగా సాగాయని వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో పొత్తుకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ సీనియర్ నేత రామ్‌గోపాల్ యాదవ్ తెలిపారు. ఇరు పార్టీల మధ్య అవగాహన కుదురుతుందని, 2027 ఎన్నికల్లో కలిసి పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ నేత ఆరాధనా మిశ్రా పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

బాలకృష్ణకు పాదాభివందనం చేసిన పరిటాల శ్రీరామ్

బాలకృష్ణకు పాదాభివందనం చేసిన పరిటాల శ్రీరామ్

అక్రమ మైనింగ్‌పై జగన్ నిర్ణయానికి సుప్రీంకోర్టు మద్దతు

అక్రమ మైనింగ్‌పై జగన్ నిర్ణయానికి సుప్రీంకోర్టు మద్దతు

తిరుపతి దగ్గర ఆలయ కూల్చివేత.. జగన్ ఆగ్రహం

తిరుపతి దగ్గర ఆలయ కూల్చివేత.. జగన్ ఆగ్రహం

కర్ణాటకలో అనూహ్య పరిణామం..ఎమ్మెల్యే రాజీనామా

కర్ణాటకలో అనూహ్య పరిణామం..ఎమ్మెల్యే రాజీనామా

ఆలయాల కూల్చివేతపై చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్‌ జగన్‌

ఆలయాల కూల్చివేతపై చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్‌ జగన్‌

ట్యాగ్లు
UP Assemble elections 2027SPINCCongressRahul gandhibjp
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు
రాజకీయాలు

పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 130 సీట్లు అడుగుతున్న కాంగ్రెస్
రాజకీయాలు

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 130 సీట్లు అడుగుతున్న కాంగ్రెస్

కేబీసీపై వైరల్ వీడియో ఫేక్
షోస్

కేబీసీపై వైరల్ వీడియో ఫేక్

బాలకృష్ణకు పాదాభివందనం చేసిన పరిటాల శ్రీరామ్
రాజకీయాలు

బాలకృష్ణకు పాదాభివందనం చేసిన పరిటాల శ్రీరామ్

లిబియా తీరంలో రష్యా నౌక.. దాడి చేసింది మేమేనన్న ఉక్రెయిన్
జనరల్

లిబియా తీరంలో రష్యా నౌక.. దాడి చేసింది మేమేనన్న ఉక్రెయిన్

అక్రమ మైనింగ్‌పై జగన్ నిర్ణయానికి సుప్రీంకోర్టు మద్దతు
రాజకీయాలు

అక్రమ మైనింగ్‌పై జగన్ నిర్ణయానికి సుప్రీంకోర్టు మద్దతు

ఆసియాలో మోదీకి రెండో స్థానం.. పెరిగిన ప్రభావం!
జనరల్

ఆసియాలో మోదీకి రెండో స్థానం.. పెరిగిన ప్రభావం!

తిరుపతి దగ్గర ఆలయ కూల్చివేత.. జగన్ ఆగ్రహం
రాజకీయాలు

తిరుపతి దగ్గర ఆలయ కూల్చివేత.. జగన్ ఆగ్రహం

భారత ఫార్మా ఎగుమతులకు మరింత ఊపు.. రూ.లక్షల కోట్ల పరిశ్రమ వృద్ధి!
జనరల్

భారత ఫార్మా ఎగుమతులకు మరింత ఊపు.. రూ.లక్షల కోట్ల పరిశ్రమ వృద్ధి!

ఏపీలో వానలు.. హైదరాబాద్‌లో చలి వాతావరణం!
జనరల్

ఏపీలో వానలు.. హైదరాబాద్‌లో చలి వాతావరణం!

‘ఆకాశంలో ఒక తార’కు వీకెండ్ జోష్ కొనసాగుతుందా?
సినిమాలు

‘ఆకాశంలో ఒక తార’కు వీకెండ్ జోష్ కొనసాగుతుందా?

‘ఈఎన్ఈ రిపీట్’ సక్సెస్ పార్టీకి ముహూర్తం ఫిక్స్!
సినిమాలు

‘ఈఎన్ఈ రిపీట్’ సక్సెస్ పార్టీకి ముహూర్తం ఫిక్స్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!