
బిజినెస్

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలో ఉదయం 7:30 గంటల నుంచి 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. నిరసనలు జరుగుతున్న ప్రాంతాలతో పాటు ఇతర సున్నితమైన ప్రాంతాల్లో కూడా పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేసి పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
మెట్రో స్టేషన్ల మూసివేతతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడగా, ప్రయాణానికి ముందు మెట్రో సేవలపై తాజా సమాచారం తెలుసుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు. పరిస్థితిని బట్టి ఆంక్షల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!